నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము

neekasaadhyamainadi eediyu leedu samasthamu

🎵 TG-2078🌐 Telugu
పల్లవి

నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2)       ||నీకసాధ్యమైనది||

1వ చరణం

వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా

Report Error