♪♫
TG-3923
Telugu
నీకు ఇష్టముగా ఇలలో
Neeku Ishtamugaa Ilalo
22
views
పల్లవి
నీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలని ఎంత కష్టమైనా నీలోనే ఉండాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశలు తీర్చే నా మెస్సయ్యా (2) నువ్వంటే ఇష్టము నా యేసయ్యా నాతో నువ్వుంటే ఇష్టము నా మెస్సయ్యా (2) నీ వెంటే నేను నడవాలని నీ ఇంటిలోనికి రావాలని (2) నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యా నీ వాత్సల్యతతో నను నింపావయ్యా (2) అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే||
1వ చరణం
ఎన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలతో ఈ లోకంలో నే పడియుండగా (2) నీ కృపచేత నను నీవు నిలిపావయ్యా నీ కరుణతో నను నీవు నడిపావయ్యా (2) అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.