TG-2759
Telugu

నీకు సాటి ఎవరు లేరు

neeku saati evaru leeru

88
views
పల్లవి

నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా) ఇలలో నీవే ఏకైక దేవుడవు (2) ఆత్మతో సత్యముతో ఆరాధింతును నీదు క్రియలు కొనియాడెదను అత్యున్నతుడా నా యేసయ్యా నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు||

1వ చరణం

పరమందు దూతలు నిను పొగడుచుందురు నీవే ప్రభువుల ప్రభువని నీ ఘన కీర్తిని వివరించగలనా నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా||

2వ చరణం

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను ఊహించువాటి కంటే అత్యధికముగా దయచేయువాడవు నీకే స్తోత్రం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.