TG-3926
Telugu

నీలాంటి ప్రేమ ఈ లోకాన

Neelaanti Prema Ee Lokaana

0
views
పల్లవి

నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? – (2) నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా? – (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ యేసయ్యా (2) ||నీలాంటి||

1వ చరణం

చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2) నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా||

2వ చరణం

దొంగలే నిన్ను దూషించగను నా అనువారే అపహసించగా (2) నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా||

3వ చరణం

తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు కనుక క్షమియించుమని (2) ప్రార్ధన చేసితివయ్యా మము క్షమియించితివయ్యా (2) ||యేసయ్యా||

4వ చరణం

నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా (2) నీదు ప్రేమే నా గానం నీ ప్రేమే నా భాగ్యం (2) ||యేసయ్యా||