వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు
velugunu rakssanna karthayunagunaa balamagu
వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని స్తోత్రింతును వెరువను నేనిక నెవ్వరికిన్ వెలుగైన యేసే నా దుర్గము
అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన యుగయుగంబుల నేలెడి ప్రభువు యఘముల బాపి నను వెలిగించును ||వెలుగును రక్షణ||
నా దీపమును వెలిగించు ప్రభువే నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును నా దోషము లెల్లను దన కాంతిలో నాదరముగ కడిగి రక్షించును ||వెలుగును రక్షణ||
పలువిధ శోధనల్ నను జుట్టినను విలువగు సంపద లంతరించినను వెలుగుదూత నాపై యురులొడ్డిన నలయక నిత్యము నడచెద వెల్గులో ||వెలుగును రక్షణ||
తల్లిదండ్రులు విడచినగాని యుల్లము భీతిని భయమందినను ఎల్ల ప్రజలు నను ద్వేషించినను ఎడబాయడునా ప్రియుడగు యేసు ||వెలుగును రక్షణ||
క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తముగ గనుడి ప్రియులార శాశ్వతంబగు రాజ్యము చేర సత్వరమాయన వెలుగును బొందరె ||వెలుగును రక్షణ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.