♪♫
TG-3927
Telugu
నీలి ఆకాశంలో
Neeli Aakaashamlo
17
views
పల్లవి
నీలి ఆకాశంలో (2) నీ నీతి రాజ్యంలో నేనుండ గోరితి ప్రభువా ఆ… నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి ఆకాశంలో||
1వ చరణం
నా ప్రియుడు నా చెంతనున్నాడు గోప రసమంత సువాసన కలవాడు నా ప్రియుడు ఏదేను వనమాలి కర్పూరాల పుష్పాల సమానుడు అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – (2) ||నీలి ఆకాశంలో||
2వ చరణం
నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా నా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెను నా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగా ఆ రత్నాల వర్ణుడు నను తాకగా నేను నిదురించిన మనసు మేలుకొన్నది నా మనసంతా యేసుతో నిండగా రక్షించి నను చేర్చె ఆ ప్రేమ పురమున – (2) ||నీలి ఆకాశంలో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.