♪♫
TG-3928
Telugu
నీలో జీవించాలని
Neelo Jeevinchaalani
24
views
పల్లవి
నీలో జీవించాలని నీలోనే బ్రతకాలని (2) యుగయుగాల నీతోనే ఉండాలని (2) తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2) యేసూ నువ్వే కావాలి నా యేసూ నీతో ఉండాలి (2) ||నీలో||
1వ చరణం
మిగిలింది నాకు నిత్య శోకము ఈ నా జీవిత యాత్రలో కన్నీళ్లే నాకు అన్న పానములై భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2) నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2) నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2) ||యేసూ||
2వ చరణం
కటిక చీకటే నాకు స్నేహమాయెను అంధకారమే నాలో నాట్యమాడెను ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు మార్గమే తెలియక మతి చెలించెను (2) నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2) నీ నామమే నాకు మార్గమాయెను (2) ||యేసూ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.