TG-2912
Telugu

నీలో సమస్తము సాధ్యమే

neeloo samasthamu saadhyamee

39
views
పల్లవి

నీలో సమస్తము సాధ్యమే (2) మహొన్నతుడా యేసయ్యా బలవంతుడా యేసయ్యా ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4)        ||నీలో||

1వ చరణం

అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా||

2వ చరణం

శోధన వేదనలలో జయమిచ్చువాడవు బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు