TG-3471
Telugu

నీలోనే ఆనందం నా దేవ నీలోనే నాకు జీవం

neeloonee aanandam naa deeva neeloonee naaku jeevam

David Selvamభారత్ మండ్రు · Bharat Mandruఏవం మార్క్ రోనాల్డ్ · Evan Mark Ronald
0
views
Chorus

నీలోనే ఆనందం నా దేవ నీలోనే నాకు జీవం (2) నిన్న నేడు నిరంతరం మారని దేవా (2)

పల్లవి పూర్వ భాగం

ఈ లోకమంతా నేను వేధకిన లేదయ ఎక్కడ ఆనందం . నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హ్రుదయం పొంగేను (2) నా హ్రుదయం పొంగేను

1వ చరణం

ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను (2) తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నీరీక్షించే తండ్రి నా యేసు (2) ||ఈ లోకమంతా||

2వ చరణం

ఏ ప్రేమ నీ ప్రేమ కు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా (2) నన్ను మరువని ప్రేమ నీదయ్య నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్య నన్ను మరువని ప్రేమ నీదయ్య నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్య ||నీలోనే ఆనందం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.