♪♫
TG-1126
Telugu
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
neenendukani nee soththugaa maarithini
201
views
పల్లవి
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
1వ చరణం
నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ||నేనె||
2వ చరణం
నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ||నేనె||
3వ చరణం
నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ||నేనె||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.