TG-445
Telugu

నేను నీ వాఁడను దేవా

neenu nee vaamdanu deevaa

201
views
పల్లవి

నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ నేను నీ వాఁడను దేవా వీనుల నీ ప్రేమ వివర మాలించుచు మేను నాత్మయు నిత్తు మేలొసఁగు నీకిపుడు ||నేను నీ||

1వ చరణం

ఘనుఁడ వైన నీవు గలిగించితివి నన్ను మనుజ లోకమునందు నిను నేను సేవింప ||నేను నీ||

2వ చరణం

నాకు నవసర మౌన నానా వస్తువు లిచ్చి నీ కటాక్షము నన్ను నిల్పుచున్నది గాన ||నేను నీ||

3వ చరణం

నా దోషముల నుండి నన్ను రక్షింపను నీదు పుత్రుని ప్రేమ నిండార నొసగితివి ||నేను నీ||

4వ చరణం

నే నఘముల చేత నిజముగఁ జావఁగ నీ నెనరుచే నన్ను నీవు బ్రతికించితివి ||నేను నీ||

5వ చరణం

నా తనువు నాత్మయు నాకుఁ గల్గిన వన్ని నా తండ్రి యిచ్చితివి నాకు నీ కృప చేత ||నేను నీ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.