TG-2996
Telugu

నేను నీతిమంతుడను - కాను దేవా

neenu neetimantudanu - kaanu deevaa

Mohan Jonahమోహన్ జోనా · Mohan Jonahమోహన్ జోనా · Mohan Jonah
1
views
Chorus

నేను నీతిమంతుడను - కాను దేవా నీకు నమ్మకస్థునిగా - లేను యేసయ్యా కరుణించి నన్ను బ్రోచి కాపాడినావు ఏకాకినైన నాకు దిక్కు నీవైనావు (2)

1వ చరణం

యోబు జీవితంబు నందు - నీచుడనని పలికాడు పౌలు జీవితంబు నందు - దౌర్భాగ్యుడనన్నాడు ఎంత సేవ చేసినా - ఎంత ఏడ్చినా (2) నీదు పాద ధూళిలోన - మొఖము దాచుకున్నారు (2) ||నేను నీతిమంతుడను ||

2వ చరణం

నన్ను వెంబడించువారు - నా శిష్యులు అవుతారు నన్ను విసర్జించువారు - అపవాదికి అనుచరులు (2) యేసు అన్న మాటలో - ఎంత మర్మమో క్రీస్తు లేని క్రైస్తవం - ఎంత ఘోరమో బ్రతుకులోన మార్పు కోరి - నన్ను చేరదీసావు (2) ||నేను నీతిమంతుడను ||

3వ చరణం

నీదు నీతి వాక్యమందు - నను నీతిగ మలచావు నీతి లేని జీవితాన్ని - సిలువలో క్షమించావు (2) నేను నీకు సొంతము - జీవితాంతము నీదు ప్రేమ కావ్యము - పరమగీతము నీచమైన నా గుణాన్ని - ప్రేమతో సహించావు (2). ||నేను నీతిమంతుడను ||