TG-5369
Telugu

నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి

Neenu Thaggaali Yeesu Neevee Hechchaali

0
views
పల్లవి

నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2) నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2) ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2) ||నేను||

1వ చరణం

నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2) నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2) యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2) పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2) ||ఇదియే||

2వ చరణం

ఆదాము పాపము నాలో వసియించియుండగా (2) యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2) ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2) యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2) ||ఇదియే||