TG-3930
Telugu

నీతి న్యాయముల

Neethi Nyaayamulu

19
views
పల్లవి

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో ||నీతి||

1వ చరణం

ప్రతి వాగ్ధానము నా కొరకేనని ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2) నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) ||నీతి||

2వ చరణం

పరిమళ వాసనగ నేనుండుటకు పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2) ప్రగతి పథములో నను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) ||నీతి||

3వ చరణం

నిత్య సీయోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2) మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2) ||నీతి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.