నీతిగల యెహోవా స్తుతి
Neethigala Yehovaa Sthuthi
నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి ||నీతి||
చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును ||నీతి||
సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను ||నీతి||
గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి ||నీతి||
పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు ||నీతి||
ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి ||నీతి||
ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే ||నీతి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.