TG-3934
Telugu

నీతో నా జీవిత

Neetho Naa Jeevitham

0
views
పల్లవి

నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే (2) నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2) కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా||

1వ చరణం

సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2) నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||

2వ చరణం

ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2) నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||