♪♫
TG-3939
Telugu
నీతి సూర్యుడవై
Neetho Sooryudavai
0
views
పల్లవి
నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2) నీదు రక్షణతో మమ్ము కాచినందుకు నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2) నీకే వందనం – నీకే వందనం నీకే వందనం – యేసు రాజ వందనం (2) ||నీతి||
1వ చరణం
త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా నీదు విందులోన చేరాలని మా దేవా (2) సిద్ధపాటుకై కృపలను చూపుమని నిన్నే వేడితిమి నీవే మా బలమని (2) ||నీకే||
2వ చరణం
నీ నామము రుచిని ఎరిగిన వారము మేము నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2) నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2) ||నీకే||