♪♫
TG-3940
Telugu
నీతోనే నా నివాసమ
neetoonee naa nivaasama
28
views
పల్లవి
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని (2) ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో||
1వ చరణం
కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని (2) సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో||
2వ చరణం
సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2) సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) ఆనందమే పరమానందమే (10)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.