TG-2883
Telugu

నీతో గడిపే ప్రతి క్షణము

neetoo gadipee prati kshanamu

Ps.Jyothi RajuPs. జ్యోతి రాజు · Ps.Jyothi Raju
80
views
పల్లవి

నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)    ||నీతో||

1వ చరణం

మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2) నా ప్రేమ చేత కాదు - నీవే నను ప్రేమించి (2) రక్తాన్ని చిందించి - నన్ను రక్షించావు (2)   ||యేసయ్యా||

2వ చరణం

గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) నా శక్తి చేత కాదు - నీ ఆత్మ ద్వారానే (2) వాగ్ధానము నెరవేర్చి - వారసుని చేసావు (2)   ||యేసయ్యా||