నీటి వాగుల కొరక
Neeti Vaagula Koraku
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2) ||నా ప్రాణమా||
పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2) నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా||
అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2) కంటిపాపగా నీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా||
నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2) నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.