TG-3191
Telugu

నీతో భువిలో సమమెవరయ్య (కృపాసంపన్నుడా)

neetoo bhuviloo samamevarayya (krupaasanpannudaa)

Paul Mosesవై సునీల్కుమార్ · Y Sunilkumarసుజాత దీవెన కారల్ రాజి లేఖన · Sujatha, Deevena carol, Raji lekhana
15
views
Chorus

నీతో భువిలో సమమెవరయ్య నీతో ఎవరూ నిలువగ లేరయ్యా నీలాంటి దేవుడు లోకాన లేరు సరిపోల్చదగినది ఎవరు మా ఆది అంతము నీవే ఆధారమైనవాడా మా దాగుచోటువు నీవే కృపాసంపన్నుడా యుగయుగయుగాలు తరతరాలు నీవే ఏకైక దేవుడవు ||నీతో భువిలో||

1వ చరణం

సృుష్టిని చేసినవాడవు చరితలో నిలిచిన వాడవు పరిశుద్ధుడా ఆదిసంభూతుడా (2) సత్యస్వరూపుడా నా ప్రాణనాధుడా నాలో వశియించు నా దైవమా ఉన్నత స్ధలములో ఆశీనుడా ||నీతో భువిలో||

2వ చరణం

రాజులకు రాజువు నీవే ప్రభువులకు ప్రభుడవు నీవే ఏకైకుడా మాకై ఏతెంచినావా (2) భూలోకమంతట నిన్నే స్తుతించగా వేవేల దూతలతో కొనియాడు దైవమా నా స్తుతి గానము నీవేనయ్యా ||నీతో భువిలో||

3వ చరణం

అన్నికాలంబులలోన ఉన్నవాడనువాడవుగా మా పక్షమై కృపలను చూపితివి (2) నీ ప్రేమ చాలును నే వెనుకచూడను నాతో నడిచే నా నేస్తమా శరణం నీకే శ్రీమంతు ||నీతో భువిలో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.