♪♫
TG-3954
Telugu
నీవే నీవే కావాలి
Neeve Neeve Kaavaali
0
views
పల్లవి
నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును (2) ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే||
1వ చరణం
నీ సృష్టికర్తను నీవు విడచినా నీకిష్టమైన రీతి నీవు నడచినా (2) దోషివయినా ద్రోహివయినా దేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం||
2వ చరణం
పాపాలతో నీవు పండిపోయినా ప్రేమించువారు లేక కృంగిపోయినా (2) యేసుని చరణం – పాప హరణం యేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం||
3వ చరణం
నీటి బుడగలాంటిది నీ జీవితం గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2) అధికుడవైనా అధముడవైనా ఆయన ప్రేమ – కోరిపుడైనా (2) ||ఈ కాలం||