TG-1382
Telugu

నీవే ఆశ నీవే శ్వాస

neevee aasha neevee shvaasa

81
views
పల్లవి

నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2) నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే||

1వ చరణం

ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్ధమాయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కాన రాదే హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నే నడచి నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి నీ కౌగిలిలో ఒదుగుదునే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.