TG-5322
Telugu

నీవేయని నమ్మిక నీవేయని నమ్మిక యేసు

Neeveeyani Nammika Neeveeyani Nammika Yeesu

19
views
పల్లవి

నీవేయని నమ్మిక (2) నీవేయని నమ్మిక యేసు నా మార్గము సత్యము జీవము సర్వము నీవే నా మార్గము సత్యము జీవము నా సర్వము నీవే ||నీవేయని నమ్మిక||

1వ చరణం

దారి తప్పిన నాకు నిరీక్షణాస్పదమైతివే (2) నీవే నా ఆశ్రయం నీవే నా అతిశయం (2) ఘనమైన నీ ప్రేమను నిత్యము స్తుతింతును యేసు ధన్యమౌ నా మార్గము ||నీవేయని నమ్మిక||

2వ చరణం

నిన్ను చేరిన నాకు  అతిశయాస్పదమైతివే (2) నీవే నా రక్షణ నీవే నా నిరీక్షణ (2) దివ్యమైన నీ స్నేహం ఘన మోక్షమార్గము యేసు ధన్యమౌ నా జీవితం ||నీవేయని నమ్మిక||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.