నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును

neevu cheesina upakaaramulaku neeneemi chellinthunu

🎵 TG-1107🌐 Telugu
పల్లవి

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా? - వేలాది పొట్టేళ్ళనా? (2) ||నీవు||

1వ చరణం

వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భఫలమైన నాజేష్ట పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||

2వ చరణం

మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో (2) కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||

3వ చరణం

విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది||

4వ చరణం

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? (2) కపట నటనాలు చాలించి నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది||

Report Error