TG-2343
Telugu

నీవు లేని రోజు అసలు

neevu leeni rooju asalu

79
views
పల్లవి

నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2) నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు||

1వ చరణం

బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే||

2వ చరణం

ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.