నీవు తడితే తలుప
Neevu Thadithe Thalupu
నీవు తడితే తలుపు తీయనా ప్రభు నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు||
పాపముతో నిండియున్న నా బ్రతుకును పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా పాపములో జీవించుచున్న నాపై ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2) నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు||
తెరిచాను నా తలుపులు రావా ప్రభు ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను నాలోన నీవుండి పోవాలి నీతోనే నడవాలి ఇక మీదట (2) రక్షణనే కేడెము చేత పట్టి ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) ||నీవు||
విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా స్వస్థతనే వరముల దయచేయుమా కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2) ఎల్లవేళలా నాతో ఉండి నన్ను చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) ||నీవు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.