నీవు తప్ప నాకు ఇలలో
neevu thappa naaku ilaloo
నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా ||నీవు తప్ప||
కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నను దాచినావయ్యా నా చేయి విడువక నను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా ||నువ్వంటూ||
కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్య కరమే అందించినావు ఆ సిలువలోనే నీ ప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నను కాచినావయ్యా ఒక క్షణము వీడక కాపాడినావయ్యా నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.