నీవు తోడైయుండగా యేసు
neevu thoodaiyundagaa yeesu
నీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ ||నీవు తోడైయుండగా||
గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా యుక్తి తెలియక తిరిగినా – శక్తి క్షీణించిపోయినా వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి నీవు నాకు అండగా నిలచి – దారి చూపినావయ్యా నేను నీకు మెండుగా స్తుతులు – అర్పించెదను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.