TG-3972
Telugu

నీవుంటే నాకు చాలు యేసయ్యా

Neevunte Naaku Chaalu Yesayyaa

21
views
పల్లవి

నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||

1వ చరణం

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట||

2వ చరణం

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట||

3వ చరణం

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||

4వ చరణం

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.