TG-3979
Telugu

నేను ఓడిపోనయా

Nenu Odiponayaa

0
views
పల్లవి

నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2) నేను ఓడిపోనయా – నా పక్షానుండగా నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2) నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2) నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా||

1వ చరణం

అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2) ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||

2వ చరణం

నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే (2) ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||

3వ చరణం

నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే నన్ను దూషించిన చోటే దీవించినావే (2) ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||