నెరవేరుగురుతు లవి యన్నియు - పరిపూర్ణమాయె కాలంబును

neraveeruguruthu lavi yanniyu - paripuurnnamaaye kaalanbunu

🎵 TG-1125🌐 Telugu
పల్లవి

నెరవేరుగురుతు లవి యన్నియు - పరిపూర్ణమాయె కాలంబును ఇక యేసుడు ఏతెంచును - ఇది నమ్ముమా ఓ క్రైస్తవ

1వ చరణం

పెండ్లి కుమారుండుగా యేసుడు - ఏతించుచున్నాడు ఈభూమికి సిద్ధంబుకమ్ము సిద్దెలు నింపి - లేనేలేదు కాలంబిక||నెర||

2వ చరణం

కొడవలి చేబూని రైతువలె - నేతించు చున్నాడు లోకేశుడు సిద్ధంబు కమ్ము నీ పంటతోడ - లేనేలేదు కాలంబిక ||నెర||

3వ చరణం

నడిరేయిలో దొంగరాక వలె - రానున్న దేసయ్య ఈరాకడ మెలకువ తోడ కనిపెట్టు సుమ్ము - లేనేలేదు కాలంబిక ||నెర||

4వ చరణం

మేఘాస నాసీనుడై దేవుడు - వేవేల దూత సమూహాలతో తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ త్వరలో వేంచేయును ||నెర||

Report Error