నిబంధనా జనులం నిరీక్షణా ధనులం
nibandhanaa janulam nireekssannaa dhanulam
నిబంధనా జనులం నిరీక్షణా ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనల జనులం యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరెదము (2) ||నిబంధనా||
అబ్రాహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం (2) మోషే బడిలో బాలురము యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం మేము నిబంధనా జనులం ||యేసు రాజు||
విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం వాక్యమే మా ఆహారం ప్రార్ధనే వ్యాయామం – అనుదినము అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం పునరుత్తానుని పత్రికలం పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం క్షమించుటే ఇల మా న్యాయం భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం క్రీస్తేసే మా భక్తికి పునాది పునరుత్తానుడే ముక్తికి వారధి పరిశుద్ధాత్ముడే మా రథ సారథి ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి ఎవరీ యేసుని అడిగేవో ఎవరోలే యని వెళ్ళేవో యేసే మార్గం యేసే జీవం యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం