TG-2990
Telugu

నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా

ningilooni chandurudaa - manda kaachee indurudaa

Dr. A.R. Stevensonఆ.ర్. స్టీవెన్సన్ · A.R. Stevensonరాజి లేఖన · Raji Lekhana
12
views
Chorus

నింగిలోని చందురుడా మంద కాచే ఇందురుడా (2) నిందలేని సుందరుడా గంధమొలికే చందనుడా (2)

పల్లవి పూర్వ భాగం

ఓ... వెన్నెలంటి చల్లని రాజా వెన్నలాంటి మనసు నీదయ్యా (2)

1వ చరణం

ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా గాయాలు నిన్ను బాధిస్తున్నా దాహంతో నోరు ఎండిపోతున్నా నాలుక అంకిట అంటిపోతున్నా ప్రేమతో పెంచిన - మమతలు పంచినా నీ శ్రమ చూడలేక గుండెపగిలిన తల్లిని శిష్యునికప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినావా (2) ||ఓ... వెన్నెలంటి||

2వ చరణం

అందాల మోముపై ఉమ్మివేయగా నీదు గడ్డము పట్టి పీకగా యూదులరాజని అపహసించగా సిలువ దిగిరమ్మని పరిహసించగా అంతా సహించి - మౌనం వహించి బాధించువారిపై ప్రేమ చూపించి ఏమిచేస్తున్నారో ఎరుగరు క్షమించుమని ప్రార్ధించినావా (2) ||ఓ... వెన్నెలంటి||

3వ చరణం

లేతమొక్కలాంటి నీ దేహముపై కొరడాలెన్నో నాట్యముచేయగా మేలే చేసినా కరుణను పంచినా కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా అంతటి శ్రమలో - చెంతననిలిచి చింతతో ఉన్న అతివల జూచి నాకోసం ఏడ్వవలదని పలికి వారిని ఓదార్చినావా (2) ||ఓ... వెన్నెలంటి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.