నిన్న నేడు నిరంతరం ఉన్నవాడవయ్యా (నీ మహిమను)
ninna needu nirantaram unnavaadavayyaa (nee mahimanu)
నిన్న నేడు నిరంతరం ఉన్నవాడవయ్యా నను ఎన్నడైనను మరువని నా మంచి యేసయ్య (2)
యేసయ్య.. నా ప్రభువా... నీ కొరకే నా ప్రాణం యేసయ్య.. నా దేవా... నీ కొరకే నా జీవితం ||నిన్న నేడు||
నా దీన దశలో నేనున్నప్పుడు నన్ను పోషించి నడిపించినావయ్య కష్టాలు కన్నీళ్లు నన్ను చుట్టినప్పుడు కన్నతండ్రిలా నన్ను ఆదరించినావయ్య (2) నా వేదనలన్నీయు తొలగించినావయ్య నీ కంటి పాపల నన్ను కాచినావయ్యా నీ కరుణతో నన్ను ప్రేమించినావయ్యా (2) ||యేసయ్య||
గాఢాంధకారంలో నేనున్నప్పుడు నాకు తోడుగా నీవు ఉన్నావు యేసయ్యా నా బ్రతుకు భారమై నేనున్నప్పుడు నా బలము నీవై నడిపించినావయ్య (2) ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించినావయ్య నీ మహిమను నాకు ఇచ్చి హెచ్చించినావయ్య నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్య (2) యేసయ్య.. నా ప్రభువా... నీ కొరకే నా ప్రాణం యేసయ్య.. నా దేవా... నీ కొరకే నా జీవితం యేసయ్య నీ మహిమ మా పైన కురిపించు యేసయ్య... ||నిన్న నేడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
