♪♫
TG-3226
Telugu
నిన్నేనే స్తుతియింతును
ninneenee stutiyintunu
0
views
Chorus
నిన్నేనే స్తుతియింతును నిన్నేనే ఆరాధింతును యేసయ్య.... (2) ఎంత కష్టమైనను శోధనలెదురైనా జీవితకాలము నిను పాడెదను (2) ||నిన్నేనే||
1వ చరణం
ఎవరు ఉన్న లేకున్నా ఏమి ఉన్న లేకున్నా నీ సన్నిధిలో ఆనందింతును బ్రతుకు భారమైనను- కరువు కాలమైనను నీ సేవలోనే నిలిచియుందును (2) కరములెత్తి స్తుతియించెదను. అన్నివేళల ఆరాధింతును (2) ||నిన్నేనే||
2వ చరణం
కష్ట కాలమైనను కలిమిలో ఉన్నను నీ తోడు నాకుంటే భయము లేదయా చింతలెన్నో ఉన్నను శ్రమలు పాలైనను నీ దయ నాకుంటే చాలు యేసయ్య (2) జీవితాంతము ప్రణుతించేదను ఆత్మతో సత్యముతో ఆరాధింతును (2) ||నిన్నేనే||
