నిన్ను వెంబడించెద
Ninnu Vembadincheda
నిన్ను వెంబడించెద నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నే నేర్చుకొందును (2) మాదిరి నీవే – నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా (2) ||నిన్ను||
పాపాంధకారం లో నుండి రక్షించి వెలిగించితివి (2) పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి (2) నీ వెంబడి రమ్మంటివి ||నిన్ను||
లోకాశలన్ని నీ కోసం నేనింక ఆశించను (2) లోపంబులేని ప్రేమతో నీ కోసం జీవింతును (2) నీ కోసం జీవింతును ||నిన్ను||
పవిత్రపరచుకొందును అర్పించు కొందును (2) కష్టాలు శ్రమలు రేగినా నిను వీడిపోనయ్యా (2) నిను వీడిపోనయ్యా ||నిన్ను||
ప్రేమ సువార్త ప్రకటింప భారంబు మోపితివి (2) సత్యమార్గంబు చాటగ పంపుము నా ప్రభువా (2) పంపుము నా ప్రభువా ||నిన్ను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.