♪♫
TG-4002
Telugu
నిను చూసే కన్నుల
Ninu Choose Kannulu
24
views
పల్లవి
నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2) నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2) నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే||
1వ చరణం
కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2) నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే||
2వ చరణం
అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2) కోపతాపములు దూరపరచయ్యా అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.