నిను మాత్రమే నే నమ్మానయా
ninu maatramee nee nammaanayaa
నిను మాత్రమే నే నమ్మానయా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా (2) నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును (2) కృప చూపువాడవయా నీ పిల్లలకు (2) ||నిను మాత్రమే||
నీవు సెలవియ్యగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది (2) సకలము నీదెనయా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయా (2) సమకూర్చువాడవయా నీ పిల్లలకు (2) ||నిను మాత్రమే||
నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు (2) యుద్ధము నీదెనయా ఓ శూరుడా ముందుకు సాగెదనయా (2) జయమిచ్చువాడవయా నీ పిల్లలకు (2) ||నిను మాత్రమే||
నీవు కరుణించగా కాదనువాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు (2) సాయము నీదెనయా సహాయకుడా నీలో దాగెదనయా (2) బలమిచ్చువాడవయా నీ పిల్లలకు (2) ||నిను మాత్రమే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.

