నిను నమ్మిన నా యెడల కృప చూపుచున్నావయ్యా
ninu nammina naa yedala krupa choopuchunnaavayyaa
నిను నమ్మిన నా యెడల కృప చూపుచున్నావయ్యా నిను ప్రేమించువారికి ఆశ్రయమై ఆదుకుంటివి (2) దాటి వెళ్లని దయగల దేవుడవు (2) దారిచూపే – దయామూర్తివి నీవే మాకు ఆధారమైతివి – అంధకారలోయలో అభయుడవై (2) ||నిన్ను||
మహోన్నతుని చాటున నన్ను దాచితివి ఏ హాని సమీపించనియ్యక – బలమైన భాహువును చూపితివి నా భారమైన భాధ్యతను భరించుటకే (2) కల్వరిగిరిలో కార్చిన రక్తమే – నా రక్షణకు కారణమాయెనా (2) విజయవీరుడా నీకే ఆరాధనా మృత్యుంజయుడా నీకే ఆరాధనా మహిమాన్వితుడా నీకే ఆరాధనా అత్యున్నతుడా నీకే ఆరాధనా
శ్రేష్ఠమైన వాక్కుతో నను పిలచితివి నీ ఘనమైన పరిచర్యకోసమే అనాధి సంకల్పమును నెరవేర్చుటకే అనాధనైన నా యెడల కృప చూపితివి (2) తల్లి గర్భములో రూపించకమునుపే నన్నెన్నుకున్నావు నీ సాక్షిగా (2)
నీ నిత్యమహిమకు నన్ను నియమించితివి సదాకాలము నీతో ఉండుటకు అఖండమైన విజయమును నాకిచ్చుటకే అనంత ప్రేమ నా మీద కురిపించితివి (2) యెహోవా భాహువా లెమ్మూ రమ్మూ మేఘమువలె నన్నావరించుము (2)
