TG-4006
Telugu

నిను స్తుతించినా

Ninu Sthuthinchinaa

20
views
పల్లవి

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను||

1వ చరణం

స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

2వ చరణం

ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

3వ చరణం

ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

4వ చరణం

ఆదిసంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.