TG-4007
Telugu

నిను స్తుతియించే కారణ

Ninu Sthuthiyinche Kaaranam

18
views
పల్లవి

నిను స్తుతియించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా (2) ప్రతి క్షణము ప్రతి దినము స్తుతియించుటే నా భాగ్యము ప్రతి క్షణము ప్రతి దినము స్తుతియించుటే నా జీవము ||నిను||

1వ చరణం

ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము అగాధ జలములలోన నీకు స్తోత్రము (2) పరమందు నీకు స్తోత్రం ధరయందు నీకు స్తోత్రం (2) ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||

2వ చరణం

చీకటి లోయలలోన నీకు స్తోత్రము మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2) గృహమందు నీకు స్తోత్రం గుడిలోన నీకు స్తోత్రం (2) ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||

3వ చరణం

నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము (2) శ్రమలైనా నీకు స్తోత్రం కరువైనా నీకు స్తోత్రం (2) ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.