నిరంతరం నీతోనే
Nirantharam Neethone
నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2) నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం||
చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను (2) నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని (2) పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
నీ రూపము నేను కోల్పయినా నీ రక్తముతో కడిగితివి (2) నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి (2) నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.