నిరంతరం నీతోనే జీవించాలనే - ఆశ నన్నిల బ్రతికించుచున్నది
nirantharam neethoonee jeevinchaalanee - aasha nannila brathikinchuchunnadi
నిరంతరం నీతోనే జీవించాలనే - ఆశ నన్నిల బ్రతికించుచున్నది నాప్రాణేశ్వరా యేసయ్యా - నా సర్వస్వమా...యేసయ్యా..
చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని (2) పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు- నీ రాకడకై.. ||నిరంతరం నీతోనే||
నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై.. ||నిరంతరం నీతోనే||
తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై. ||నిరంతరం నీతోనే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.