నిరంతరమైన నీ కృపలో
Nirantharamaina Nee Krupalo
నిరంతరమైన నీ కృపలో నే పొందుచున్న ఆనందమే అది అవధులు లేని ఆనందమే అది శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన||
అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2) నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన||
బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు బలమైన కార్యములను బహుగా చేయించినావు (2) నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన||
మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది ఎంతో మేలే (2) ||నిరంతరమైన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.