TG-5268
Telugu

నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా

Nirantharan Neethoonee Undaalani Yeesayyaa

21
views
పల్లవి

నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా ప్రతి క్షణం నీకొరకే బ్రతకాలని ఆశయ్యా (2) ప్రతి క్షణము నీతోనే ప్రతి అడుగు నీ కొరకే (2) నిన్నే కీర్తించెదన్ - కొనియాడెదన్ నీకై బ్రతికెదన్ (2) ||నిరంతరం||

1వ చరణం

నీటి బుడగ లాంటి నన్ను - నీ హస్తములతో కాచి కాపాడిన నా దేవా (2) నిను విడచి ఉండలేను నీ మేలులు మరువలేను (2) నిన్నే స్తుతియించెదన్ - ఘనపరచెదన్ నీకై బ్రతికెదన్ (2) ||నిరంతరం||

2వ చరణం

ఎన్నికయే లేని నన్ను - నీ ప్రేమ తో హత్తుకొని బలపరచిన నా దేవా (2) నిను వదిలి బ్రతుకలేను - నీ ప్రేమను మరువలేను నిన్నే ప్రార్థించెదన్ - ధ్యానించెదన్ (2) నీకై బ్రతికెదన్ (2) ||నిరంతరం||

3వ చరణం

చెదరిన నా హృదయమును - నీ కృపతో కరుణించి స్వస్థ పరచిన నా దేవా (2) నీ సన్నిధి విడువలేను - నీ కృపను మరువలేను(2) నిన్నే ప్రేమించేదన్ - ప్రకటించేదన్ (2) నీకై బ్రతికేదన్ (2) ||నిరంతరం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.