TG-2200
Telugu

నిరతము నిను స్తుతియించినా దేవా

nirathamu ninu sthuthiyinchinaa deevaa

78
views
పల్లవి

నిరతము నిను స్తుతియించినా దేవా – సరిపోదు ఆరాధన ప్రతి క్షణము కీర్తించినా ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2) ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నికే ఆరాధన (2) ||నిరతము||

1వ చరణం

ప్రభువా యెహోవా రాఫా నీవే నా స్వస్థతలు అన్ని నీవే నీవే దేవా యెహోవా నిస్సి నీవే నా విజయాల అధిపతి నీవే నీవే (2) ||ఆరాధన||

2వ చరణం

ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా కోపానికి కాలయాపన నీదే ప్రభువా నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా నీ తోడు ఉంటే నా దరి రాదు ఏ భాధ నా గతము రద్దు చేసిన నాదు దేవా నా రేపును నడిపించేది నీవే ప్రభువా నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.