నిరతము స్తుతియించుము
Nirathamu Sthuthiyinchumu
నిరతము స్తుతియించుము ఓ మనసా క్రీస్తేసుని స్తుతించు (2) బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2) మరువక స్తుతియించుము ఓ మనసా జయగీతముతో స్తుతించు ||నిరతము||
వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2) నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2) ఆ నిజ స్నేహితుని కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము||
అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2) నీ భారం తొలగించి తన కృపలో ఆదరించే (2) నీ ఆత్మ కాపరియైన పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2) ||నిరతము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.