♪♫
TG-4014
Telugu
నిత్యం నిలిచేది నీ ప్రేమే
Nithyam Nilichedi Nee Preme
0
views
పల్లవి
నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2) నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2) ||నిత్యం||
1వ చరణం
మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2) నీకెవరూ సాటే రారయ్యా నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం||
2వ చరణం
ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2) నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2) ||నిత్యం||