♪♫
TG-2435
Telugu
నిత్యము స్తుతించినా నీ ఋణము
nithyamu sthuthinchinaa nee runnamu
83
views
పల్లవి
నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు || నిత్యము అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.